calender_icon.png 5 November, 2024 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్ట్‌లో యువతిపై లైంగికదాడి

03-11-2024 01:26:30 AM

పోలీసుల అదుపులో నిందితుడు

ఘట్‌కేసర్, నవంబర్ 2 (విజయక్రాంతి): మార్ట్‌లో పనిచేస్తున్న ఓ యువతిపై లైంగికదాడి జరిపి గర్భవతిని చేసిన సూపర్‌వైజర్‌ను ఘట్‌కేసర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ పరశురాం, బాధితురాలి కథనం ప్రకారం.. ఘట్‌కేసర్ పట్టణంలోని కృష్ణ మార్ట్‌లో స్థానికంగా ఉండే ఓ యువతి (20) గత కొంతకాలంగా పనిచేస్తోంది.

అదే మార్ట్‌లో పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన ఖాజా బషీర్(35) సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. నెలరోజుల కిందట  యువతి వాష్‌రూమ్‌కు వెళ్లగా.. వెనుకాలే వెళ్లిన బషీర్ బలవంతంగా ఆమెపై లైంగికదాడికి దిగాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఈ విషయాన్ని యువతి ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది. కాగా శనివారం మధ్యాహ్నం యువతి కళ్లు తిరిగి మార్ట్‌లో పడిపోయింది.

మార్ట్ యజమాని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వెంటనే స్థానిక హస్పిటల్‌కు తరలించాడు. పరీక్షలు జరిపిన వైద్యులు యువతి గర్భవతి అని తేల్చడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. ఆమెను నిలదీయగా మార్ట్‌లో పనిచేస్తున్న ఖాజా బషీర్ తనపై లైంగికదాడి జరిపినట్లు చెప్పింది. తల్లిదండ్రులతో కలిసి యువతి ఘట్‌కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.