calender_icon.png 30 September, 2024 | 7:05 AM

బాలికపై యువకుడి లైంగిక దాడి

30-09-2024 12:07:05 AM

  1. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన బాధితురాలి బంధువులు, గ్రామస్తులు
  2. గ్రామంలో 144 సెక్షన్

సిద్దిపేట, సెప్టెంబరు 29 (విజయక్రాంతి): బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడగా, ఆమె కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురవన్నపేటలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపి న వివరాలు.. మండలానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక శనివారం ఇంట్లో ఒంటరిగా ఉండగా, గురవన్నపేటకు చెందిన 20 ఏళ్ల యువకుడు ఇంట్లో చొరబడి..

బాలికపై లైంగిక దాడికి పాల్పడి అక్కడి నుంచి ఉడాయించాడు. బాధితురాలు సాయంత్రం తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదేరోజు రాత్రి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే కోపోద్రిక్తులైన  బాధితురాలి బంధువులు, గ్రామస్తులు ఆదివారం ఉదయం నిందితుడి ఇంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. పోలీసులు గ్రామానికి చెరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గ్రామంలో 144 సెక్షన్ విధించి పికెటింగ్ చేపట్టారు.