calender_icon.png 21 January, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికపై లైంగిక దాడి

12-07-2024 02:25:14 AM

సిద్దిపేట అర్బన్, జూలై 11: బాలికపై లైంగికదాడిపై కుటుంబీకులు నంగునూరు పోలీసులను ఆశ్రయించారు. రాజగోపాల్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై కొనయిపల్లికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. గురువా రం రాత్రి బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి వెంటనే పోలీసులు సిద్దిపేట భరోసా కేంద్రానికి తరలించారు. లైంగికదాడికి పాల్పడిన సమయంలో నిందితుడి వెంట మరికొందరు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఇబ్రహీంపట్నంలోనూ..

ఇబ్రహీంపట్న, జూలై 11 (విజయక్రాంతి): బాలికపై లైంగికదాడికి యత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలా నికి చెందిన బాలిక ఈ నెల 7న ఇంటిబయట ఆడుకుంటున్నది. ఆమెకు చాక్లెట్ ఇస్తానని చెప్పి బోడ నర్సింహ అనే 50 ఏళ్ల వ్యక్తి లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిం దితుడిని అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశా ల మేరకు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.