calender_icon.png 19 April, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుడి కుమార్తెపై లైంగికదాడి

05-04-2025 12:12:19 AM

నిందితుడికి పదేండ్లు జైలు

ఎల్బీనగర్, ఏప్రిల్ 4 : స్నేహితుడు అని... సొంత బిడ్డగా చూసుకుంటాడని నమ్మిన ఒక వ్యక్తి.. తన అనారోగ్యం కారణంగా కుమార్తె బాగోగులు చూస్తాడని అతడి ఇంటికి పంపించాడు. కానీ, నమ్మిన స్నేహితుడే కాటేశాడు. ఇంటికి వచ్చిన మైనర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నిందితుడికి పోక్సోచట్టం ప్రకారం కోర్టు పదేండ్లు జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే..  పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఒక వ్యక్తి తన అనారోగ్య కారణాలతో తాత్కాలికంగా తన కూతురి సంరక్షణ ను కొన్ని రోజులు అతడి స్నేహితుడికి అప్పగించాడు.

అయితే, సదరు స్నేహితుడు బాలికకు మాయమాటలు చెప్పి, అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘ టనలో బాలాపూర్ పరిధిలోని షహీన్ నగర్ లో నివసిస్తున్న సయ్యద్ హాజీ అలీ (43) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడి స్నే హితుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక కారణాలతో కొన్ని రోజులు తన కూతురు బాగోగులు చూసుకోవాలని హాజీ అలీని కోరి, ఇంటికి పంపించాడు.

హాజీ అలీ ద్రోహి బుద్ధితో ఇంటికి వచ్చిన స్నేహితుడి కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2021లో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని జైలుకు పంపా రు. ఈ కేసును ఎల్బీనగర్ లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించి, శుక్రవారం తీర్పు వెలువరించింది. ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి గారు నిందితుడిని దోషిగా నిర్ధారించి పదేం డ్ల జైలుశిక్షతోపాటు రూ.15వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సునీత, డి.రఘు వాదనలు వినిపించారు.