calender_icon.png 17 January, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగికదాడి

17-01-2025 02:33:10 AM

  • హాస్టల్ గదిలో ఒంటిరిగా నిద్రిస్తుండగా ఘాతుకం
  • ఇబ్రహీంపట్నం మంగళపల్లిలో దారుణం
  • సీవీఆర్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న బాధితురాలు
  • పోలీసుల అదుపులో నిందితుడు

ఇబ్రహీంపట్నం, జనవరి 16 (విజయక్రాంతి): పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ హాస్టళ్ల వద్ద సెక్యూరిటీ లోపం, ఓ కామాంధుడి లైంగిక వాంఛకు ఓ అభంశుభం తెలియని బీటెక్ విద్యార్థిని జీవితం నాశనమైంది. బాధితురాలు హాస్టల్ గదిలో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితుడు ఆమెపై లైంగికదాడికి పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంటప్నం మండలం మంగళ్‌పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల సమీపంలోని సాయిబాబా గుడిపక్కన ఉన్న దినాకర గర్ల్స్‌హాస్టల్‌లో ఉంటోంది. సంక్రాంతి సెలవులు వచ్చినప్పటికీ త్వరలో సెమిస్టర్ పరీక్షలు ఉన్న కారణంగా సదరు విద్యార్థిని ఇంటికి వెళ్లకుండా హాస్టల్‌లోనే ఉండిపోయింది.

నల్లగొండ జిల్లాకు చెందిన అజిత్ (22) ఇదే హాస్టల్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండే ఒక రియల్ ఎస్టేట్ యజమాని వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలు హాస్టల్ గదిలో ఒంటరిగా నిద్రపోతున్నటు గమనించిన అజిత్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తేరుకున్న బాధితురాలి డయల్ 100కు ఫోన్‌చేసి విషయం చెప్పడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ఆస్పత్రికి తరలించారు