calender_icon.png 5 October, 2024 | 4:50 AM

నమ్మి వచ్చిన బాలికలపై లైంగికదాడి

05-10-2024 02:03:15 AM

కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్

జనగామలో ఐదుగురు యువకుల ఘాతుకం

జనగామ, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ప్రేమికులను నమ్మి రాత్రివేళ వారి కోసం వెళ్లి న ఇద్దరు బాలికలపై వారి ఇద్దరి ప్రేమికులతో పాటు మరో ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. కారులో తిప్పుతూ కామవా ంఛ తీర్చుకున్నారు. జనగామ జిల్లా కేం ద్రంలో వారం రోజుల క్రితం జరిగిన ఈ దా రుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ంది.

జనగామ జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన పద్నాలుగేళ్ల బాలిక, మల్కాజిగి రికి చెందిన పదిహేనేళ్ల బాలిక కొన్ని నెలలుగా సైదాబాద్ ఐఎస్ సదన్ డివిజ న్ పరిధిలోని ఓ ప్రైవేట్ పునరావాస కేంద్రంలో ఆవాసం పొందుతున్నారు. దేవరుప్పుల మండలానికి చెందిన బాలికకు రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లికి చెందిన నాగరాజు దేవరుప్ప ల మండలానికి చెందిన బాలికతో గతంలో ప్రేమ వ్యవహా రం నడిచినట్టు సమాచారం.

మల్కాజిగిరికి చెందిన బాలికతో కూడా నిందితుల్లో ఒకరు ప్రేమాయాణం సాగినట్టు తెలి సింది. కాగా బాలికలకు పునరావాస కేంద్రం లో ఉండటం ఇష్టంలేక సెప్టెంబర్ 24న అక్క డి నుంచి తప్పి ంచుకున్నారు. అదే రోజు రాత్రి జనగామ బ స్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ నాగరాజు స్నేహితుడు పాముకుంట్ల సాయిదీప్ బస్టాండ్ ఆవరణలోని పాన్‌షాప్ లో ఉన్నాడు.

గమనించిన దేవరుప్పల మండలానికి చెందిన బాలిక   సాయిదీప్ దగ్గరికి వె ళ్లి నాగరాజుకు ఫోన్ చేయాలని కోరింది. వెం టనే విషయం నాగరాజుకు చెప్పడంతో అత డు బస్టాండ్‌కు వచ్చి బాలికను ఓ రూమ్‌కు తీసుకెళ్లాడు. ఆమెతో పాటు ఉన్న మరో బాలికను సాయిదీప్ ఆశ్రయం కల్పిస్తానని నమ్మి ంచి సిద్దిపేట రోడ్‌లోని ఓ బేకరీకి తీసుకెళ్లాడు. బేకరీ మూసేసి బాలికపై సాయిదీప్‌తో పాటు బేకరీ నిర్వాహకుడు రాజు లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఆ తర్వాత ఇద్దరి బాలికలు తీసుకుని ముగ్గురు యువకులు ఒకచోట కలిశా రు. పట్టణానికే చెందిన మ రో ఇద్దరు మిత్రు లు అఖిల్, రోహిత్‌ను పిలిచారు. అఖిల్ కారు తీసుకుని వారి వద్దకు వెళ్లాడు. కారును జనగామ చుట్టుపక్కల ప్రాం తాల్లో తిప్పుతూ కారులోనే ఐదుగురు యువకులు బాలికలపై రాత్రంతా లైంగికదాడికి పాల్పడ్డారు.

ప్రేమించారని ఇద్దరిని నమ్మి వం చిన బాలికలపై తమ స్నేహితులతో కలిసి క్రూ రంగా వ్యవహరించారు. లైంగిక వాంఛ తీర్చుకున్న అనంత రం బాలికలను జనగామ బస్టాం డ్‌లో విడిచిపెట్టారు. బస్సు ఎక్కి హైదరాబాద్‌కు వెళ్లాల ని సూచించారు. అయితే.. అప్పటి కే పునరావాస కేంద్రం నిర్వాహకుల ఫిర్యాదు తో రంగ ంలోకి దిగిన సైదాబాద్ పోలీసులు జనగామ లో బాలికల కోసం గాలించారు.

జనగామ బస్టాండ్‌లో అనుమానస్పదంగా కనిపి ంచిన బాలికలను అదుపులోకి తీసుకుని జనగామ సఖి సెంటర్‌కు తరలించారు. మరుసటి రోజు పునరావాస కేంద్రానికి తరలించారు. అక్కడ భరోసా కేంద్రం వారు బాలికలను విచారించగా తమపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించారు. దీంతో జనగామలో ఐదుగురు నిందితులను పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. 

గతంలోనూ అనేక మందితో.. 

ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులు గతంలోనూ అనేక మ ంది యువతులను మోసం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్నేహం పేరుతో యు వతులకు పరిచయమవ్వడం, ఆ తర్వాత ప్రేమ పేరుతో దగ్గరై కామవాంఛ తీర్చుకున్నాక వదిలేటయడం వీరి నైజాం.

ఆ తర్వాత గతంలో చనువుగా ఉన్న ఫొటోలను దగ్గర పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌కు కూడా పాల్పడేవారని తెలుస్తోంది. బెదిరించి డబ్బులు వసూలు చేయ డం, లేదంటే తమ మిత్రుల కామవాంఛ తీర్చే లా ఒప్పించడం వంటి ఘటనలూ ఉన్నాయని కొందరి నోట వినిపిస్తోంది. నిందితు లను కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవు: హరీశ్‌రావు

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాష్ర్టంలో బాలికలు, మహిళ లకు భద్రత కరవైందని, ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇద్ద రు మైనర్లపై జరిగిన అత్యాచార ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని శుక్రవార ం ఎక్స్‌వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసె ంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసినా నిర్ల క్ష్యం వీడటం లేదని, ప్రతిరోజూ రాష్ర్టం లో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటన లు జరుగుతూనే ఉన్నాయన్నారు. హోం శాఖను నిర్వహించడంలో సీఎం రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించా రు. బాలికలపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరారు.