calender_icon.png 11 February, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతిపై లైంగికదాడి

11-02-2025 01:28:16 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో అర్ధరాత్రి యువతిపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 46లో ఓ కంపెనీకి సంబంధించిన బంగ్లాలోని ఓ గదిలో వాచ్‌మెన్ కుటుంబం, డ్రైవర్ శివ నరసింహ(32) ఉంటున్నారు.

వాచ్‌మెన్ కూతురు పెళ్లి విషయంలో తాను సహాయం చేస్తానని శివ నరసింహ నమ్మించాడు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాచ్‌మెన్ కూతురి(19) పై లైంగికదాడి చేశాడు. యువతి ప్రతిఘటించడంతో దిండుతో నోరు నొక్కి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.