యువకుడిపై పోక్సో కేసు!
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 6 (విజయక్రాం తి): బాలికతో మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో లైంగికదాడికి పాల్పడిన బైక్ మెకాని క్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన యువకుడు తెలకపల్లి మండల కేంద్రంలోని ఓ బైక్ రిపేర్ సెంటరులో మెకానిక్ పని నే ర్చుకుంటున్నాడు. ఓ బాలికకు ప్రేమ పేరు తో దగ్గరై పలుమార్లు లైంగిక దాడికి పాల్ప డ్డాడు.
ఈ విషయమై గతంలోనే పోక్సో కేసు నమోదు కాగా జైలుకు వెళ్లొచ్చాడు. మళ్లీ ఆ బాలికతోనే పరారయ్యాడు. బాధిత కుటుం బసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో గాలించి అరెస్టు చేసి, రెండోసారి పోక్సో కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.