calender_icon.png 11 January, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారిపై లైంగికదాడి.. ముద్దాయికి ఉరే సరి

01-08-2024 08:30:00 AM

కింది కోర్టు తీర్పుకు హైకోర్టు ఆమోదం

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో కలకలం రేసిన చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడికి హైకోర్టు ఉరి శిక్షను నిర్దారించింది. కింది కోర్టు విధించిన ఉరి శిక్షను హైకోర్టు ఆమోదించింది. నగర పరిధిలోని నార్సింగ్లో ౨౦౧౭లో నాలుగున్నర ఏండ్ల చిన్నారిపై సెంట్రింగ్ పనులు చేసే కార్మికుడు దినేశ్‌కుమార్ లైంగికదాడి చేసి, కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసులో పోలీసుల వాదనలను రంగారెడ్డి జిల్లా కోర్టు.. నిందితుడు దినేశ్ కుమార్‌కు ఉరి శిక్ష వేస్తూ 2021లో తీర్పు చెప్పింది. ఈ తీర్పును ముద్దాయి హైకోర్టులో సవాల్ చేశాడు.

కింది కోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరిస్తూ జస్టిస్ శ్యామ్‌కోషి, జస్టిస్ సాంబశివ నాయుడుతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. అభం శుభం తెలియని చిన్నారిపై లైంగికదాడి, ఆపై హత్య చేయడం హేయమైన చర్యగా పరిగణిస్తున్నట్టు ప్రకటించింది. ఇలాంటి కేసుల్లో ముద్దాయిల పట్ల కనికరం అవసరం లేదని తేల్చి చెప్పింది. కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ తుది ఉత్తర్వులు జారీచేసింది. ముద్దాయికి ఉరి శిక్ష విధించడం కరెక్టేనని స్పష్టంచేసింది.  దినేష్ చేసిన అప్పీ ల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇలాంటి తీవ్ర నేరాలకు పాల్పడేవాళ్లకు సత్వరం శిక్షలు పడితేనే నేరాలు తగ్గుతాయని, బాధితులకు కొంతైనా న్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. 

ఉద్యోగుల మెరిట్ ప్రకారం సీనియార్టీ  

విద్యుత్ సంస్థలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): ట్రాన్సోకో, జెనోకో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లో నేరుగా నియమితులైన ఉద్యోగుల సీనియార్టీ విషయంపై ఆ సంస్థలు మెరిట్ ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తీర్పుచెప్పింది. పిటిషనర్లు తమ వినతి పత్రాలను విద్యుత్తు సంస్థలకు ఇవ్వాలని, వాటిపై మూడు నెలల్లోగా విద్యుత్ సం స్థలు తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పీ మాధవీదేవి ఇటీవల తీర్పు వెలువరించారు. విద్యుత్తు సంస్థల్లో నేరుగా నియమితులైన ఉద్యోగుల మెరిట్ ఆధారంగా సీనియారిటీని నిర్దారించాలని కమిటీ నివేదిక మేరకు 2021 లో సంబంధిత సంస్థలు ఉత్తర్వులను జారీచేశాయి. ఆ ఉత్తర్వులను తెలంగాణ విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున ప్రధాన కార్యదర్శి సీ భానుప్రకాశ్ హైకోర్టు లో సవాలు చేశారు.

1986 నుంచి ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో నేరుగా నియమితులైన ఉద్యోగులందరికీ మెరిట్ ఆధారంగానే సీనియార్టీ నిర్దారించి నష్టపోయిన వారికీ పదో న్నతులు కల్పించాలని కోరారు. పిటిషనర్ తరఫున మహమ్మద్ అద్నాన్ షాహిద్ వాదనలు వినిపిస్తూ.. మెరిట్ ప్రాతిపదికన సీని యార్టీ నిర్దారణ అనేది ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రెగ్యులేషన్స్‌లో స్పష్టంగా ఉందని చెప్పారు. 1986 నుంచి నియమించబడిన ఉద్యోగులందరికీ ఈ బెనిఫిట్ అమలు చేయాలని కోరారు. విద్యుత్తు సంస్థల తరఫున సీనియర్ న్యాయవాది జీ విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. 2008లో రాజేశ్ కరణ్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం మెరిట్ ఆధారంగానే సీనియారిటీలను నిర్దారించాలని మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు.

క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే 2009 నుంచి నియమితులైన ఉద్యోగులందరికీ మెరిట్ ప్రాతిపదికన సీనియార్టీ నిర్దారించి పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించినట్టు వివరించారు. 1986 నుంచి సీనియార్టీలను సమీక్షిస్తే.. కొందరు ఇప్పటికే పదోన్నతులు పొంది పదవి విరమణ కూడా పొందిన వారు ఉంటారని, న్యాయ సమస్యల నేపథ్యంలో 1986 నుంచి సీనియార్టీ సమీక్షిం చడం వీలుకాదన్నారు. 

విద్యుత్తు సంస్థలు పిటిషనర్ల అప్లికేషన్లను ౩ నెలలలోగా పరిశీలించి, 2009 కంటే ముందు నియమితులైన ఉద్యోగులకు మెరి ట్ ప్రాతిపదికన సీనియారిటీల నిర్దారణ చేయడానికి సాధ్య, అసాధ్యాలను పరిశీలిం చి తుది నిర్ణయం తీసుకోవాలని విద్యుత్ సంస్థలను ఆదేశించింది.