- యువకుడి ఇల్లు దహనం చేసిన బాలిక బంధువులు
- ఆందోళనకారుల దాడిలో సీఐ, ఇద్దరు ఎస్సైలకు గాయాలు
- పోలీస్ వాహన అద్దాలు ధంసం
- ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో ఉద్రిక్తత
ఆదిలాబాద్, డిసెంబర్ 21 (విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలకేంద్రంలో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెంది న ఓ యువకుడు బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపి స్తూ బాలిక బంధువుల శనివారం రాత్రి ఆందోళనకు దిగారు.
యువకుడి ఇంటిపై బాలిక బంధువులు రాళ్ల దాడి చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. ఇరువర్గాలవారు ఘరణకు దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువకుడ్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు.
దీంతో పోలీసు వాహనం అద్దాలను ఆందోళనకారులు ధంసం చేశారు. అడ్డుకుంటున్న పోలీసుల మీద దాడి చేశారు. ఈ దాడిలో ఇచ్చోడ సీఐ భీమేష్, ఇచ్చోడ, గుడిహత్నూర్ ఎస్సైలు మహేందర్, తిరుపతితోపాటు పలువురి పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.