calender_icon.png 1 April, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళతో శృంగారం.. ఆపై హత్య

29-03-2025 12:20:35 AM

గుర్తుతెలియని మహిళ హత్యకేసును ఛేదించిన సనత్‌నగర్ పోలీసులు

నిందితుడు అరెస్ట్

కుత్బుల్లాపూర్, మార్చి 28(విజయక్రాంతి): ఓ వ్యక్తి ఓ గుర్తు తెలియని మహిళతో శృంగారం చేసి ఆపై హత్య చేసి పరారయ్యాడు. ఈ కేసు సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి సంచలనం సృష్టించింది. ఛాలెంజ్‌గా తీసుకున్న సనత్‌నగర్ పోలీస్‌లు మర్డర్ జరిగిన 48 గంటలలోనే కేసును చేధించి ఆ వివరాలను బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడిం చారు.

సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ లేడీ ఎర్రగడ్డ ఫ్లైఓవర్ కింద వంటిపై బట్టలు లేకుండా మర్డర్ కాబడి ఉందంటూ డయల్ 100కు బుధవారం రాత్రి 10:50 సమయంలో ఓ వ్యక్తి ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందడంతో మహిళ హత్య జరిగిన ప్రదేశాన్ని సనత్ నగర్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, బాలానగర్ డివిజన్ ఏసీపీ హనుమంతరావు పరిశీలించారు.

నిందితుడి కోసం పోలీసులు గాలిస్తుండగా బాలానగర్ శోభనా బస్ స్టాప్‌లో ఓ వ్యక్తి శుక్రవారం అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో అతనిని పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. నిందితుడి పేరు కొమ్మరాజు కనకరాజు అలియాస్ రాజు, బచ్చన్నపేట్ గ్రామం, జనగాం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తేల్చారు.

సదరు లేడీతో శృంగారం చేయడానికి ఎర్రగడ్డ ఫ్లైఓవర్ కింద గల గూడ్స్ వెహికిల్ పార్క్ చేసిన ప్రదేశానికి తీసుకువచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో నిందితుడు కొమ్మరాజు ఆ మహిళ ఛాతీపై బలంగా కొట్టి నెట్టేయడంతో మహిళ స్పృహ కోల్పోయి చనిపోయింది. నిందితుడు కొమ్మరాజు కనకరాజు మహిళని హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సదరు నిందితుడు గతంలో దొంగతనం కేసులో అరెస్ట్ కాబడి జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మహిళ హత్యను తానే చేసినట్లు నిందితుడు ఒప్పుకోవడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు గురైన మహిళ పేరు, వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారిస్తున్నారు. మహి ళ పూర్తి వివరాలు ఎవరికైనా తెలుస్తే తమకు తెలియజేయాలని కోరుతున్నారు.