బాంబే హైకోర్టు సంచలన తీర్పు
ఓ కేసులో వ్యక్తికి పదేళ్ల జైలు
ముంబై: ఏకాభిప్రాయంతో సెక్స్ చేసినా భార్య మైనర్‌గా ఉంటే అది రేప్ కిందే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించిన కేసులో ఓ వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మహిళతో శృంగారం రేప్ కిందకే వస్తుందని జస్టిస్ జీఏ సనాప్ వెల్లడించారు. పెళ్లయిందా.. లేదా అన్న విషయం ఇక్కడ అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఇటువంటి కేసులో కింది కోర్టు ఓ వ్యక్తికి విధించిన 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను బెంచ్ సమర్ధించింది.ఓ వ్యక్తి మైనర్ బాలికను లోబరుచుకుని ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం విషయం బయటకు పొక్కకుండా ఆ బాలికను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. కానీ తర్వా త అతడి ప్రవర్తనలో మార్పు రావడంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించి సదరు వ్యక్తిపై కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన కింది కోర్టు సదరు వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. నిందితుడు బాంబే హైకోర్టులో సవాల్ చేశాడు.
బాంబే హైకోర్టు కూడా శిక్షను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. పుట్టిన పిల్లాడి డీఎన్‌ఏ రిపోర్టు నిందితుడి డీఎన్‌ఏ రిపోర్ట్‌తో సరిపోలినా కానీ aaఅతడు ఆ బాలుడికి కేవలం బయోలాజికల్ పేరెంట్ మాత్రమే అవుతాడని తీర్పు చెప్పింది.