సూర్యాపేట, జనవరి 28 : నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు వారికి కుట్టు మిషన్లు, సైకిల్లను పంపిణీ చేస్తున్నట్లు కమ్యూనిటీ డెవలప్ మెంట్ సెంటర్ (సిడి సి) అధ్యక్షుడు వంగాల రత్నప్రసాద్ అన్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని కమ్యూనిటీ డెవలప్ మెంట్ సెంటర్ కార్యాలయంలో హోప్ కేర్ సెంటర్ అండ్ కిట్ దా కింగ్ డం, వంగాల యేసు రత్నం ఫౌండేషన్ సహకారంతో నిరుపేద మహిళలకు 50 కుట్టు మిషన్లు, నిరుపేద విద్యార్థులకు 50 సైకిళ్లను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధి సమాజాభివృద్ధికి చిహ్నమని తెలిపారు. కుట్టు మిషన్ల ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు సహకారం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బొజ్జ ప్రశాంత్, వంగాల లాజరస్, సండ్రపాటి లాజరస్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.