04-03-2025 05:17:35 PM
ఎవైఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య
చిట్యాల,(విజయక్రాంతి): నిరుపయోగంగా ఉన్న కుట్టుమిషన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఏవైఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య డిమాండ్(AYS State Publicity Secretary Pulla Mallaiah) చేశారు. ఈ మేరకు ఆయన మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఎంపీఎస్ఓకు మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని అర్హులైన వారికి కుట్టుమిషన్లను పంపిణీ చేయాలన్నారు. నెలల తరబడి స్థానిక రైతు వేదికలో కుట్టు మిషన్లు తుప్పపట్టి పోతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం మహిళలకు చేయూత అందించేందుకు ఉచితంగా శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లను పంపిణీ చేయాలని నిర్ణయించిందని గుర్తు చేశారు. వెంటనే జిల్లా, మండల అధికారులు స్పందించి కుట్టుమిషన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి మ్యాదరి సునీల్, మండల సహాయ కార్యదర్శి కనకం తిరుపతి, కార్యవర్గం సభ్యులు పుల్యాల సురేష్, నద్దునూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.