11-03-2025 12:42:04 AM
ఆర్యవైశ్య నాయకులు వందనపు శైలేష్ గుప్త
కామారెడ్డి అర్బన్, మార్చి 10 (విజయక్రాంతి) ః ఆర్థిక స్వలంబనతోనే మహిళల అభివృద్ధి సాధ్యమని ఆర్యవైశ్య నాయకులు వందనపు శైలేష్ గుప్త అన్నారు. సోమవారం హైదరాబాదులో కామారెడ్డికి చెందిన పేద మహిళకు కుట్టు మిషన్ అందజేశారు. ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ర్ట చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బా లు ను పేద మహిళ కుట్టు మిషన్ అం దించాలని కోరగా ఆర్యవైశ్య నాయకులు వందనపు శైలేష్ గుప్తాను సంప్ర దించడంతో వెంటనే స్పందించి మనుగుల కుమారి కి కుట్టుమిషన్ ను హైదరాబాద్ లో అంద చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య మహిళా నాయకురాలు ఉప్పల శారద మాట్లాడుతూ పేద మహిళ కోసం కుట్టు మిషన్ అందజేయడం శైలేష్ గుప్తాకు ఉన్న సామాజిక బాధ్యతకు నిదర్శనమని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని అన్నారు. ఉప్పల శారద కు ప్రత్యేక కృతజ్ఞతలను శైలేష్ గుప్తా తెలియజేశారు.