calender_icon.png 23 April, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాకు ఫిర్యాదు చేసిన 24గంటల్లో మురుగు సమస్యకు పరిష్కారం..

22-04-2025 11:43:58 PM

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): తమ ఇండ్లు మురుగు నీటిలో మునిగాయని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండలం రామచంద్రయ్య కాలనీ వాసులు ఫిర్యాదు చేసిన 24 గంటల్లో హైడ్రా అధికారులు మురుగు సమస్యకు పరిష్కారం చూపారు. తమ ఇండ్లు మురుగులో కూరుకుపోవడంతో ఇండ్లు ఖాళీ చేయాల్సి వస్తోందని రామచంద్రయ్య కాలనీ వాసులు హైడ్రాకు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో శాటిలైట్ ద్వారా పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం హైడ్రా అధికారులు రామచంద్రయ్య కాలనీకి వెళ్లి మురుగు కాలువను పునరుద్ధరించారు. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు.