07-02-2025 12:41:46 AM
పెద్ద కొడఫ్గల్ ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): పెద్ద కొడఫ్గల్ మండల కేంద్రంలో గురువారం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మురుగు కాల్వలను శుభ్రం చేశారు. ఎంపీడీవో లక్ష్మీకాంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని పరిశీలించి, ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా నిరంతరం గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇతర గ్రామాలకు ఆదర్శంగా, మురుగు కాల్వల శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఈ కార్యక్రమం గ్రామాల పరిశుభ్రతను మెరుగుపరచడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, పారిశుద్ధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.