calender_icon.png 27 February, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్లు స్పందించండి..!

27-02-2025 07:10:44 PM

ప్రధాన మార్కెట్ కు వెళ్లే దారిలో మురికినీరు 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్ కు వెళ్లే దారిలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న మురిగునీరు రోడ్డుపై పారుతుండడంతో కూరగాయలు, చేపలు, మాంసాహారం కొనుగోలు చేసేందుకు వెళ్లే విక్రయదారులకు అసౌకర్యకరంగా మారింది. నిత్యం వందల మంది కాలినడకన మార్కెట్కు వెళుతున్న సందర్భంలో దారి గుండా ద్విచక్ర వాహనాలు వెళుతుండడంతో కాలువలోని మురికి నీరు పాదాచారులపై పడుతుంది. మురికి నీరు మీద పడుతున్న ఏమి చేయలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. మురుకు నీరు ప్రవహిస్తున్న స్థానంలో పైప్ లైన్ వేయాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.