01-04-2025 12:26:35 AM
పట్టించుకోని మునిసిపల్ అధికారులు
ప్రజలకు తప్పని ఇబ్బందులు
జహీరాబాద్, మార్చి 31 : జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనీ వసుంధర నగర్ కాలనీలో మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు తెలిపారు. మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయడం లేదని కాల్వలో పేరుకుపోయిన మట్టిని తీయడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. కాలువలో మట్టి పేరుక పోవడంతో ఇళ్లలో నుండి వచ్చే నీరు రోడ్డుపైకి వచ్చి ప్రవహిస్తుంది .వసుంధర నగర్ కాలనీ నుండి మెయిన్ రోడ్డుకు దర్గా వద్దకు వెళ్లే రోడ్డు పై ములుగు నీరు ప్రవహిస్తోంది. దీనితో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లే వారికి దుర్గంధం తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ కాలనీకి వెళ్లే రోడ్డును అధికారులు పరిశీలించి కాలువల నుండి మట్టిని తొలగించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని వసుంధర నగర్ కాలనీ ప్రజలు కోరుతున్నారు.