అవస్థలు పడుతున్న ప్రజలు
మానకొండూర్, జనవరి 28: ఈ మురుగునీరుని చూసి ఎక్కడో మార్ముల గ్రామం పట్టణం అనుకునేరు అక్కడే పొరపాటు పడినట్లే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని హైదరా బాద్ కరీంనగర్ రాజీవ్ రహదారికి ఆను కొని ఉన్న ఆర్టీసీ బస్టాండు పెట్రోల్ పంపు సమీపంలో నిత్యం మురుగునీటితో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నిత్యం రోడ్డుపైనే నీరు పారుతున్నాయి అయినప్పటికీ అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించు కోకపోవడంతో నిత్యం రాకపోకలకు ప్రజ లు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం జ్యోతిష్మతి కళాశాల, రవాణా శాఖ, కార్యాలయానికి వివిధ సేవలకు వచ్చే ప్రజలు ఈ దుర్గంధం భరించలేక నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉదయం అయిందంటే మురుగునీరు రోడ్డుపై పారుతుండడంతో అక్కడున్న వ్యా పారస్తులు ప్రజలు దుర్గందాన్ని భరించలే కపోతున్నారు. ఈ దుస్థితితో లోనే నిత్యం రాకపోకలకు వచ్చేవారికి దుర్గంధంతో ముక్కున చెయ్యి అడ్డు పెట్టుకొని వెళ్తు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారు లు డ్రైనేజీ నుంచి వెలువడే మురుగునీటి భారీ నుంచి తమను కాపాడాలని పలు వురు కోరుతున్నారు.