calender_icon.png 30 November, 2024 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో భారీగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు

30-11-2024 02:15:44 AM

  1. ఆరు జిల్లాల్లో 10 డిగ్రీల లోపే..
  2. మూడు రోజులు వర్ష సూచన 
  3. ఎల్లో అలర్ట్ జారీ  చేసిన ఐఎండీ

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఆరు జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ నమోదు కావడంతో చలి తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది. ఆసిఫాబాద్ కుమ్రంభీమ్ జిల్లాలోని సిర్పూర్‌లో 8.1 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లాలోని న్యాల్‌కల్‌లో 8.2 డిగ్రీలు, ఆదిలాబాద్‌లోని భీమ్‌పూర్‌లో 8.9 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలోని కోటగిరిలో 9.7 డిగ్రీలు, కామారెడ్డిలోని జుక్కల్‌లో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా.. రాష్ట్రానికి రాబోయే మూడు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజుల పాటు చలిగాలులతో పాటు తేలికపాటి వర్షాలు పడుతాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కుమ్రంభీమ్, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీనంగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ చెప్పింది.