calender_icon.png 25 February, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం

25-02-2025 12:00:00 AM

తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్

పాల్వంచ, ఫిబ్రవరి 24 : 2024వ సంవత్సరంలో తెలంగాణ రాష్ర్టంలో నిర్వహించినటువంటి కులగణనలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈ యొక్క సర్వేను తిరిగి మళ్లీ రీ సర్వే చేయాలని తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ర్టంలో బీసీలలో అత్యధిక జనాభా కలిగిన కులం మున్నూరు కాపులదని గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 వ సంవత్సరంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తెలంగాణ రాష్ర్టంలో మున్నూరు కాపుల జనాభా సంఖ్య 28 లక్షలు అని తేల్చగా ఇప్పుడు 2024 వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో 13 లక్షల మంది మాత్రమే మున్నూరు కాపులు ఉన్నట్లుగా ఎలా చెప్తున్నారని అన్నారు. 

కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు చింతా నాగరాజు, సాదం రామకృష్ణ, తోట మల్లేశ్వర రావు, మద్దుల వీర మోహన్ రావు, బాలినేని నాగేశ్వరరావు, వీసంశెట్టి విశ్వేశ్వర రావు, గంధం నరసింహారావు, బాలినేని సత్తిబాబు, సమ్మెట వెంకట అప్పారావు, మేడిశెట్టి సాంబశివరావు, అడపా శ్రీనివాసరావు,  కొత్తచెరువు హర్షవర్ధన్, బాదర్ల జోషి,

రాంశెట్టి లక్ష్మణ్, గంధం సతీష్, పాటి భద్రం, జ్యోతుల రమేష్ , సుంకర రంగారావు, భోగి లక్ష్మయ్య, బాలినేని వీరయ్య, బాలినేని సత్యం, జమ్ముల శివ, సత్యాల పెద్దయ్య, ప్రసాద్, పభాకర్, దేశెట్టి కృష్ణ, సుధాకర్, ప్రసాద్,  లోహిత్ సాయి, అశోక్, రాంబాబు, లక్ష్మీనారాయణ, లచ్చు, సత్యం పాల్గొన్నారు.