calender_icon.png 5 April, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్లో విద్యార్థులకు తీవ్ర అన్యాయం

20-03-2025 01:56:44 AM

యాదాద్రి భువనగిరి మార్చి 19 ( విజయ క్రాంతి ): ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

విద్యారంగానికి కేటాయించిన 23, 108 కోట్లలో వివిధ రకాల విద్యారంగ ఉద్యోగులకు 22 వేల కోట్లు పోతుండగా మిగతా స్వల్ప నిధులతో విద్యారంగం ఏ విధంగా ముందుకు సాగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. సమాజాభివృద్ధి దేశాభివృద్ధి సాధించే మేధావులను, శాస్త్రవేత్తలను తయారు చేసే విద్యారంగానికి నిధులు కేటాయించకుండా చిన్నచూపు చూడడం.

ఈ ప్రభుత్వ అజ్ఞానానికి నిదర్శనమని మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ బడ్జెట్ వైఖరికి నిరసనగా విద్యార్థులు బుధవారం నాడు పట్టణంలో జూనియర్ కళాశాల నుండి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్ల గొర్ల మోదీ  రాందేవ్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి కేవలం ఐదు శాతం నిధులు మాత్రమే కేటాయించడం రాజ్యాంగం లోని కోటరి కమిషన్ విద్యారంగానికి విరుద్ధమన్నారు.

రేవంత్ సర్కార్ విద్యారంగాన్ని విస్మరిస్తున్నదని స్పష్టంగా అర్థం అవుతుంది ఇప్పటికే యూని వర్సిటీ విద్యార్థుల నుండి కిందిస్థాయి హాస్టల్ విద్యార్థుల వరకు ప్రభుత్వ నుండి ఎటువంటి స్కాలర్షిప్లు, మెస్ చార్జీలు రాలేదని అన్నారు.

ప్రభుత్వం మరోసారి ఆలోచించి  విద్యారంగానికి నిధులు 20 శాతం నిధులు కేటాయించాలని మోడీ రాందేవ్ డిమాండ్ చేశారు.  బిసి యువజన సంఘం మూడు జిల్లా నా కన్వీనర్ ఎడ్ల మహిలింగం, అనిల్, మధు, ఎండి నిహాల్, సిద్ధార్థ, వాసు, మణికంఠ, రమాదేవి, మల్లేశ్వరి ఉదయశ్రీ, విఘ్నేశ్వరీ, మనీషా పాల్గొన్నారు