calender_icon.png 26 April, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమం ఆగదు..

25-04-2025 10:56:43 PM

నేడు 25 వేల మందితో బహిరంగ సభ..

రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింల హక్కులను హరించేలా అల్లాహ్ పేరిట ముస్లిం పూర్వీకులు ఇచ్చిన భూమలను లాక్కునే కుట్రలో భాగంగానే వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తీసుకొచ్చిందని పలువురు బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, మోహ్ సిన్ ఖాన్, అన్వర్ పాషా, తఖి హుస్సేన్, హాఫిజ్ ఇద్రీస్ మాట్లాడుతూ... ఈ రోజు ముస్లింల ఆస్తులపై కన్నుపడిందని, రాబోయే రోజుల్లో క్రిస్టియన్, సిక్కుల, జైన్లు, బౌద్ధుల ఆస్తులను సైతం లాక్కునే అవకాశాలు ఉన్నాయన్నారు.

వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి ప్రతిపక్షానికి చెందిన 245 ఎంపీలు వ్యతిరేకంచారని గుర్తుచేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుమేరకు శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగసభకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ఆలిండియా ముస్లిం పర్సనల్లా బోర్డు అధ్యక్షులు ఖలెద్ సైపుల్లా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మోహిసిన్, మహ్మద్ ఎక్బాల్, సుల్తాన్, రహీం, హారున్, మేరాజ్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.