calender_icon.png 20 April, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ

12-04-2025 07:12:55 PM

టేకులపల్లి ఎస్సై సురేష్ బదిలీ.. 

ఎస్సైగా విధుల్లో చేరిన రాజేందర్.. 

టేకులపల్లి (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎస్సైల బదిలీలో టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్ బదిలీ అయ్యారు. టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్ భద్రాద్రి కొత్తగూడెం వీఆర్ కు బదిలీ కాగా, కరకగూడెం ఎస్సై ఎ.రాజేందర్ టేకులపల్లికి నియమితులయ్యారు. ఇల్లందు పోలీస్ సబ్ డివిజన్ లో మరి కొందరు ఎస్సైలు బదిలీ అయ్యారు. ఆళ్ళపల్లి ఎస్సై ఇ.రతీష్ భద్రాద్రి కొత్తగూడెం వీఆర్ కు బదిలీ కాగా, ఆయన స్థానంలో కొమరారం ఎస్సై ఎం.సోమేశ్వర్ నియామకమయ్యారు. కొమరారం ఎస్సైగా, ఇల్లందు ఎస్సైగా విధులు నిర్వహించే పఠాన్ నాగుల్ మీరా ఖాన్ బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం వీఆర్స్లో ఉన్న ఎస్ కె హసీనా ఇల్లందు ఎస్సైగా నియమితులయ్యారు. కర్కగూడెం బదిలీ అయ్యారు.