calender_icon.png 30 October, 2024 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేతేపల్లిలో 73 కిలోల గంజాయి పట్టివేత

18-07-2024 02:33:56 AM

  • ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురి అరెస్టు 
  • నిందితుల నుంచి కారు, ఐదు సెల్‌ఫ్లోన్లు స్వాధీనం

నల్లగొండ, జూలై 17 (విజయక్రాంతి): కారులో తరలిస్తున్న 73.8 కిలోల గంజాయిని నల్లగొండ జిల్లా కేతేపల్లి వద్ద పోలీసు లు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి కారు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీ నం చేసుకున్నారు. నల్లగొండలోని తన కార్యాలయంలో డీఎస్పీ శివరాంరెడ్డి బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. విజయవాడ జాతీయ రహదారిపై కారులో గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి తరలిస్తున్నారనన్న పక్కా సమాచారంతో కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, ఎస్సై శివతేజతోపాటు టాస్క్‌ఫోర్స్ సీఐ రమేశ్‌బాబు, ఎస్సై మహేందర్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు.

సూర్యాపేట వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అనుమానాస్పదంగా కనిపించడంతో నిలిపి తినిఖీ చేయగా డిక్కీలో 89 గంజాయి ప్యాకెట్లు ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు. కారులోని ఇద్దరు వ్యక్తులతోపాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన అశోక్ కుమా ర్, దీపు కుమార్ అలియాస్ వాసు ప్రజాపతి, సుష్మారాయ్‌గా పోలీసులు గుర్తించారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి ప్రాంతానికి చెందిన సుశాంత్ అనే వ్యక్తి నుంచి వీరు గంజాయి కొనుగోలు చేసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రేమ్‌సింగ్ అనే వ్యక్తికి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. గంజాయి రవాణా చేసేందుకు ఒక్కొక్కరికీ ప్రేమ్‌సింగ్ రూ.20 వేలు ఇచ్చేవాడని డీఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.18 లక్షలకుపైగా ఉంటుందనిఆయన  వెల్లడించారు.