calender_icon.png 16 April, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

70 గొర్రెలు మృత్యువాత

16-04-2025 12:15:07 AM

 నష్టపరిహారం ఇప్పిస్తాను ఎమ్మార్వో మాలతి 

నిజామాబాద్ ఏప్రిల్ 15 (విజయక్రాంతి):  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హనుమాజీపేట గ్రామంలో 70 కి పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి.  కష్టపడి గొర్రెల పెంపకంతో జీవనం సాగించే తమకు కలిగిన నష్టాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. మంగళవారం ఎండ తాపానికి గురైన జీవాలు పంట పొలంలో నీరు తాగి ఈ కొద్దిసేపటికే ప్రాణాలు వదిలాయి.  70 కి  పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయని ఎమ్మార్వో బీమాలతి తెలిపారు.  గొర్రెల బీమా పథకం ఉంటే ఖచ్చితంగా సహాయం అందిస్తామని.  ప్రభుత్వ పరంగా కాపర్లను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

రైతులు ఎండాకాలం పంట పొలాల్లో జాగ్రత్తగా ఉండాలని పశువులు వేయడానికి వస్తూ ఉంటాయాని పంట కోసిన తర్వాత మోటార్ల వద్ద విద్యుత్ వైర్లు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని ఆమె రైతులకు సూచించారు. పశువులను పెంచుకునేవారు అడవిలో పంట పొలాల వద్ద మేపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాలతి పశువుల కాపరులకు సూచించారు. 

ఉన్నది పేట్ గ్రామానికి చెందిన గంప పెద్ద రాజయ్యకు చెందిన 70 గొర్రెలు గ్రామ శివారులో నీళ్లు తాగి మృత్యువాత పడ్డాయి పూర్తి వివరాలు తెలియాల్సిందని గొర్రెలకు ఇన్సూరెన్స్ ఉంటే క్లైమ్ అయ్యేలా చూస్తామని లేని పక్షంలో అధికారుల దృష్టికి నివేదించి నష్టపోయిన గంప పెద్దరాజయ్యకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మరో మారుతి తెలిపారు.