calender_icon.png 18 April, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

75 శాతం వక్ఫ్ భూముల కబ్జా

10-04-2025 02:39:40 AM

వక్ఫ్ సవరణ బిల్లుకు ముస్లింల నీరాజనాలు 

మాజీ ఎంపీ డాక్టర్ బూరనర్సయ్య గౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లిం సామాజికవర్గాల్లో ప్రధాని మోదీ విశ్వాసాన్ని పెంచారని మాజీ ఎంపీ బూరనర్స య్య గౌడ్ పేర్కొన్నారు. దేశంలో 9.40 లక్షల ఎకరాల వక్ఫ్ భూమిలో 75 శాతం కబ్జాకు గురయ్యాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో కోట్లాది రూపాయల విలువైన వక్ఫ్ స్థలాల్లో నిర్మించిన ప్రైవేట్ హాస్పిటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, మెడికల్ కాలేజీలు.. తదితర నిర్మాణాలు కొందరు బడా నేతల చేతుల్లోనే ఉన్నాయని వాపోయారు.

బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డులో అధికంగా బడా నేతలు, వ్యాపారులు, కాంగ్రెస్ నాయకులే భూము లు కబ్జా చేసినట్టు ఆరోపణలున్నాయన్నారు. ప్రపంచం లో వక్ఫ్ ఆస్తులు అత్యధికం మన దేశంలోనే ఉన్నాయని.. కానీ యేటా రావాల్సిన కనీస రూ.12 వేల కోట్ల ఆదాయానికి బదులు కేవ లం రూ.163 కోట్లే వస్తున్నాయన్నారు. వక్ఫ్ బోర్డు పేరిట భూములను కబ్జా చేసిన వారి పై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని నర్సయ్య గౌడ్ తెలిపారు.