calender_icon.png 10 January, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.78,000 పైకి పసిడి

11-12-2024 12:00:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 10: కొద్ది రోజులుగా పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధర మంగళ వారం ఒక్కసారిగా పెరిగింది. ప్రపంచ మార్కెట్లో ఎగిసిన నేపథ్యంలో  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర తిరిగి రూ.78,000 స్థాయిని దాటింది.  రూ.820 పెరిగి రూ.78,600 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.750 పెరిగి రూ.72,050 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి ఫ్యూచర్ భారీగా 28 డాలర్లు ఎగిసి 2,714 డాలర్ల స్థాయిని అందుకుంది.  ఎంసీఎక్స్‌లో ఫ్యూచర్ రూ.78,200 స్థాయి వద్ద కదులుతున్నది.