01-03-2025 12:25:35 AM
విద్యార్థులకు కలెక్టర్ ఛాలెంజ్
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 28 ( విజయక్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు మంచి మార్కులు సాధించిన వారికి 70 సైకిళ్ళు బహుమతిగా ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. మంచి మార్కులు సాధించి అట్టి సైకిళ్లను సొంతం చేసుకోవడానికి మీరు సిద్ధమా అని కలెక్టర్ ప్రశ్నించారు. చాలెంజ్ గా తీసుకొని కష్టపడి మంచి మార్కులు సాధించి సైకిళ్లను సొంతం చేసుకోవాలన్నారు.
యాదాద్రి జిల్లాలోని 192 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 10వ తరగతి చదువుతున్న 6074 మంది విద్యార్థిని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవాలని అత్యధిక మార్కులు తెచ్చుకున్న 70 మంది విద్యార్థినీ,విద్యార్థులకు సైకిల్స్ ఇవ్వడమే కాకుండా జిల్లా కలెక్టరేట్లో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సన్మానం చేస్తామని కలెక్టర్ తెలిపారు. సి ఎస్ ఆర్ క్రింద ఈ సైకిల్స్ అందచేసిన ఐఓసీఎల్ నిర్మాణ్ యాజమాన్యానికి కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్, నిర్మాణ్ ప్రతినిధులు, అడిషనల్ కలెక్టర్ గంగాధర్ ,డీఈవో సత్యనారాయణ, ఎంఈఓ లు తదితరులు పాల్గొన్నారు