calender_icon.png 3 February, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7th సెన్స్ చెబుతుంది!

30-01-2025 12:00:00 AM

మన మెదడు, శరీరం చాలా అద్భుతమైనవి. ఏదైనా ప్రమాదం పొంచి ఉందంటే ముందే అప్రమత్తం అవుతాయి. తమను తాము కాపాడుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. ఏవైనా జబ్బులు తలెత్తుతుంటే ముందే సంకేతాలు, లక్షణాల రూపంలో హెచ్చరిస్తుంటాయి. శరీరంలో ఏదైనా జరుగుతుందంటే.. మీ సెవెంత్ సెన్స్ మిమ్మల్ని ముందుగానే అలెర్ట్ చేస్తుంది. వాటిని గుర్తించగలిగితే తీవ్రమైన సమస్యల బారినపడకుండా కాపాడుకోవచ్చు. 

ప్రస్తుతం చాలామంది రోజూ బిజీ జీవితం గడుపుతున్నారు. అయితే దీనివల్ల శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పులను గమనిం చలేకపోతున్నారు. ఆ ప్రభావంతో ఆందోళన, మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ వీటి నుంచి బయట పడకపోతే దీర్ఘకాలిక సమస్యలు శరీరంపై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

పక్షవాతం

* ఉన్నట్టుండి ముఖం, చేయి, కాలు మొద్దుబారినట్టు అనిపించడం. ముఖ్యంగా శరీరంలో ఒకవైపు బలహీనమవుతున్నట్టు, పట్టు తప్పుతున్నట్టు అనిపించడం. 

* అకస్మాత్తుగా మాట తడబడటం. అంతా అయోమయంగా అనిపించటం. ఎదుటివాళ్లు చెప్పేది అర్థం కాకపోవటం. 

* ఉన్నట్టుండి ఒక కంట్లో గానీ రెండు కళ్లలో గానీ చూపు తగ్గినట్టు అనిపించడటం.

*హఠాత్తుగా నడకలో తడబాటు, తల తిరుగుతున్నట్టు, పట్టు తప్పినట్టు అనిపించడటం. 

గుండెపోటు

* చేతుల్లో.. ముఖ్యంగా ఎడమ చేయి, భుజంలో నొప్పి. మెడ, దవడ, వీపు, కడుపులో కూడా నొప్పిగా, ఇబ్బందిగా అనిపించడటం. 

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఆయాసం.

* ఛాతీ బిగపట్టినట్టు, లోపలేదో నొక్కుతున్నట్టు అనిపించటం. నొప్పి పుట్టటం. 

* తల తిరుగుతున్నట్టు, వికారంగా అనిపించటం. వాంతులు కావడటం. 

క్యాన్సర్

* అకారంగాణ.. అదీ వేగంగా ఐదు, అంతకన్నా ఎక్కువ కిలోల బరువు తగ్గటం.

* ఆకలి మందగించటం. ఎప్పుడూ కడుపు నిండుగా ఉండటం. ముద్ద మింగుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపించడం.

* తీవ్ర నిస్సత్తువ.. ముఖ్యంగా క్యాన్సర్ వృద్ధి చెందుతున్నప్పుడు తీవ్ర అలసట తలెత్తుతుంటుంది. విశ్రాంతి తీసుకున్నా తగ్గదు. 

* నోట్లో చాలాకాలంగా మానకుండా పుండ్లు, తెల్లటి మచ్చలు. జననాంగాల్లో పుండ్లు, ఇన్‌ఫెక్షన్లు వేధించటం.

* మూత్రంలో, మలంలో రక్తం పడటం. 

* మెడ వద్ద, చంకల్లో లింప్ గ్రంథులు ఉబ్బటం. ఇవి రెండు వారాలైనా తగ్గకపోతే వెంటనే జాగ్రత్త పడాలి. 

డిప్రెషన్

* తలనొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి, కండరాల బిగువు. 

* నోరు పొడిబారటం.

* గుండె దడ, ఛాతిలో నొప్పి.

* తీవ్ర అలసట. నిస్సత్తువ.

* ఆకలి తగ్గటం. తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ అతిగా తినటం.

* తరచూ జలుబు, ఫ్లూ బారిన పడుతుండటం.

* పనులపై శ్రద్ధ, ఆసక్తి తగ్గటం.

* మతిమరుపు.

* అనవసర కోపం, ఆందోళన

థైరాయిడ్

* ఆందోళన, చిరాకు, బరువు తగ్గడం.

* కండరాల బలహీనత, కంటి చూపు తగ్గడం, మతిమరుపు

* ముఖం, శరీర భాగాలు ఉబ్బటం

* చెమట తగ్గడం, చర్మం పొడిబారటం, వెంట్రుకలు రాలిపోవడం.

* గొంతు వాపు, స్వరంలో మార్పులు. 

బీపీ

* ఛాతిలో తీవ్రంగా నొప్పి కలగడం.

* తలనొప్పి విపరీతంగా ఉండటం.

* కళ్లు మసకబారడం.

* వికారం.

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.

సైనస్

* ముఖం బరువెక్కడం.

* తీవ్రమైన తలనొప్పి.

* ముక్కు దిబ్బడ.

* పొడి దగ్గు.  

* రుచి తగ్గడం. v వాసన కోల్పోవడం.