calender_icon.png 5 December, 2024 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడో గేమ్ డ్రా

04-12-2024 12:25:20 AM

సింగపూర్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య జరిగిన ఏడో గేమ్ డ్రాగా ముగిసింది. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్‌లో 72 ఎత్తుల తర్వాత ఇద్దరు డ్రాకు అంగీకరించారు.

వరుసగా ఇది నాలుగో డ్రా కాగా.. గుకేశ్, లిరెన్ ఇద్దరు చెరో 3.5 పాయింట్లతో కొనసాగుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు టైటిల్ అందుకునేందుకు మరో 4 పాయింట్ల దూరంలో నిలిచారు. ఇప్పటివరకు జరిగిన ఏడు గేముల్లో తొలి గేమ్‌ను లిరెన్ గెలవగా.. మూడో గేమ్‌ను అర్జున్ సొంతం చేసుకున్నాడు.