calender_icon.png 26 December, 2024 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అథ్లెటిక్స్ పోటీల్లో 17 పతకాలు

07-11-2024 12:21:27 AM

గెలుపొందిన విద్యార్థులతో ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్, ఉపాధ్యాయులు

బెల్లంపల్లి, నవంబర్ 6: చెన్నూర్‌లో ఈ నెల 2న నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ అండర్ 14, 17 బాలుర అథ్లెటిక్స్ పోటీల్లో కాసిపేట బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో 17 పతకాలు సాధించారు. ఏడు గోల్డ్, నాలుగు బ్రాంజ్, ఆరు సిల్వర్ మెడల్స్ సాధించడంతో పాటు 8 మంది జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఈ నెల 4న లక్షెట్టిపేట ఎంజేపీబీసీలో నిర్వహించిన అండర్ అథ్లెటిక్స్ బాలుర రాష్ట్రస్థాయి పోటీల్లో షార్ట్‌ఫుట్ విభాగంలో ఆదర్శ్ గోల్డ్ మెడల్, నిఖిల్ సిల్వర్ మెడల్, 200 మీటర్స్ అండర్ 19 విభాగంలో కె.శేఖర్ సిల్వర్ మెడల్, 400 మీటర్స్ విభాగంలో తేజస్ బ్రాంజ్ మెడల్ సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ వూటూరి సంతోష్‌కుమార్, పీడీ హరీష్, పీఈటీ రాజేందర్ అభినందించారు.