మెదక్, నవంబర్ 19(విజయక్రాం తి): లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి ఏడేండ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చినట్లు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మెదక్ పట్టణానికి చెం దిన ఓ యువతి.. తన తల్లి చిన్నప్పుడే చనిపోతే అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నది. అదేఇంట్లో ఉండే ఆమె మామ ఒగ్గు శ్రీనివాస్ దాదాపు సం వత్సరం నుంచి మేనకోడలిని వేధిస్తుండడం తో పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించారు. సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం ఆరోపణలు రుజువు కావడంతో జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీశారద మంగళవారం నిందితుడికి ఏడేండ్ల జైలుశిక్ష, రూ.20 వేల జరిమానా విధించారని తెలిపారు.