ముంబై, జూలై 16 : ఫార్మా దిగ్గజం సిప్లాకు ఆదాయపు పన్ను శాఖ రూ.773 కోట్ల డిమాండ్ నోటీసు జారీచేసింది. 2015 నుంచి 2022 అసెస్‌మెంట్ సంవత్సరాలకు ఆదాయపు పన్ను శాఖ జారీచేసిన రూ.773.44 కోట్ల డిమాండ్ నోటీసు ను అందుకున్నట్టు సిప్లా మంగళవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. వివిధ వ్యయాలను తిరస్కరిస్తూ ఐటీ డిమాండ్ నోటీసు జారీ అయ్యిందని, ఈ నోటీసుపై అప్పీలు చేస్తామని వెల్లడించింది. ఈ ఉత్తర్వుతో కంపెనీ ఆర్థిక లేదా ఇతర కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం ఉంటుందని భావించడం లేదని సిప్లా తెలిపింది. ఈ వార్త నేపథ్యంలో సిప్లా షేరు స్వల్పంగా క్షీణించి రూ.1,507 వద్ద ముగిసింది.