calender_icon.png 28 October, 2024 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో ఏడు గంధం చెట్ల చోరీ

28-10-2024 03:07:09 PM

1,50,000 విలువ గల చెట్ల అపహరణ

కట్టే కోత మిషన్ తెచ్చి చెట్లను కోసి చోరీ చేసిన దుండగులు

కామారెడ్డి జిల్లాలో కలకలం..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో గంధం చెట్ల ను మిషన్ తో కటింగ్ చేసుకుని చోరీ చేసిన సంఘటన కలకలం సృష్టిస్తుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు ఆకిటి శ్రీకాంత్ రెడ్డి తన వ్యవసాయ బావి గేట్లపై నాలుగు సంవత్సరాల క్రితం 10 గంధం మొక్కలను నాటాడు. అవి ఏపుగా పెరుగుతున్నాయి. వాటికి ప్రతిరోజు రాత్రి కాపలాగా ఉంటున్నారు. ఆదివారం రాత్రి కాపాలగా ఎవరు లేకపోవడంతో గుర్తు తెలియని దుండగులు కటింగ్ మిషన్ తీసుకువచ్చి ఏడు చెట్లను మిషన్తో కోసుకొని వెళ్లిపోయినట్లు బాధితుడు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సుమారు లక్ష50 వేల విలువ గల గంధం చెట్లను చోరీ చేసిన దుండగులను పట్టుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానికంగా ఉన్న సామిల్ యజమానుల పని అయి ఉంటుందని ఆ రైతు భావిస్తున్నాడు. దూరం నుంచి వచ్చి ఈ పని చేయలేరని స్థానికంగా ఉన్న వారి పని అయి ఉంటుందని రైతు  తెలిపారు.