12-02-2025 04:34:10 PM
పాపన్నపేట: ఎక్కడైనా సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైన వెంటనే స్థానిక ఠాణాలో తక్షణం ఫిర్యాదు చేయాలని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇటీవల వివిధ ప్రాంతాలలో సెల్ ఫోన్ పోగొట్టుకున్న ఏడుగురు బాధితులకు సీఈఐఆర్ వెబ్ సైట్ ద్వారా రికవరీ చేసినట్లు తెలిపారు. బుధవారం వారికి ఠాణాలో ఏడు సెల్ ఫోన్లు అందజేశారు. సీఈఐఆర్ ద్వారా ఇప్పటి వరకు చాలా ఫోన్లు రికవరీ అయినట్లు పేర్కొన్నారు. ఫోన్ పోయినా వెంటనే స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, ప్రవీణ్, కిషన్ తదితరులున్నారు.