calender_icon.png 7 January, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి కల్పనకు ఏడు విధాన చర్యలు

06-01-2025 12:04:19 AM

సీఐఐ బడ్జెట్ సూచనలు

న్యూఢిల్లీ, జనవరి 5: రానున్న కేంద్ర బడ్జెట్లో మరిన్ని విధానాలు ప్రకటిస్తే ఉపాధి కల్పన మరింత పెరుగుతుందని పరిశ్రమల సమాఖ్య కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)  పలు సూచనలు చేసింది. దేశంలో యువ జనాభాను ఉత్పాదకతలో భాగం చేయడానికి పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరగాలని, తద్వారా ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని సీఐఐ పేర్కొంది.

దేశ జనభా సగటు వయస్సు కేవలం 29 ఏండ్లేనని, ప్రపంచంలో భారత్ యువ దేశమని సీఐఐ పేర్కొంటూ 2050 సంవత్సరానికల్లా పనిచేసే జనాభా మరో 13.3 కోట్లు పెరుగుతుందని తెలిపింది.  డెమొగ్రాఫిక్ డివిడెం డ్‌ను అందిపుచ్చుకునేందుకు ఏడు విధాన చర్యల్ని సూచించింది. సమగ్ర జాతీయ ఉపాధి విధానం, కార్మికులతో పనిచేసే రంగాలకు మద్దతు, అంతర్జాతీయ మొబిలిటీ అథారిటీ స్థాపన వంటి సిఫార్సులను సీఐఐ చేసింది. సూచనలివే..

* కాలేజీ విద్య ఉన్న యువతకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రారంభించాలన్నది. ఈ చర్యతో ప్రభుత్వ కార్యాలయా ల్లో యువతకు స్వల్పకాలిక ఉపాధి లభించడంతో పాటు విద్య, వృత్తి నైపుణ్యం మధ్య వ్యత్యాసం తగ్గుతుందని సీఐఐ పేర్కొంది. అంతేకాకుండా వివిధ గ్రామీ ణ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేందుకు తగిన మానవ వనరులు అందుబాటులో వస్తాయని పేర్కొంది. 

* కొత్త ఉపాధిని ప్రోత్సహించడానికి అదాయపు పన్ను చట్టం సెక్షన్ 80జేజేఏఏలో కొత్త ప్రొవిజన్ చేర్చాలని సీఐఐ సిఫార్సుచేసింది. కొత్త ఉపాధి కల్పించే వ్యాపారా లకు ఇప్పటికే లభిస్తున్న చాప్టర్ వీఐఏ డిడెక్షన్‌ను కొనసాగిస్తూనే పన్ను రాయితీనిచ్చే కొత్త ప్రొవిజన్ చేర్చాలని కోరింది. 

* ప్రస్తుతం వివిధ మంత్రిత్వ శాఖలు/రాష్ట్రాల్లో ఉన్న ఉపాధి కల్పన పథకాలన్నిం టినీ ఒకటిగా చేసి సమగ్ర జాతీయ ఉపాధి విధానాన్ని ప్రకటించాలని సీఐఐ సూచించింది. ఈ సమగ్ర విధానం కింద ఒక ఇంటిగ్రేటెడ్ పోర్టల్ నేషనల్ కేరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్)ను ఏర్పర్చి, అందులో కి వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రల పోర్ట ల్స్ నుంచి డేటా అంతటినీ ఫ్లో చేయాల ని కోరింది.

* పనిచేసే జనాభాలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచి, ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిచ్చేందుకు సీఎస్‌ఆర్ నిధుల్ని ఉపయోగించి కొత్త చర్యలు చేపట్టాలని సీఐ ఐ సిఫార్సుచేసింది. మహిళా కార్మికుల్ని పెంచడానికి పారిశ్రామిక కస్టర్స్‌లో ప్రభు త్వ మద్దతుతో క్రెచెస్ ఏర్పాటు చేయాలన్నది.

* గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్‌కు సోషల్ సెక్యూరిటీ కవరేజ్ కల్పించడం ద్వారా ఉపాధి పెరుగుతుందని తెలిపింది.

* పలు దేశాల్లో వృద్ధ జనాభా పెరుగుతున్నందున, పనిచేసే సిబ్బంది కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో విదేశీ మంత్రిత్వ శాఖ అధీనంలో ఇంటర్నేషనల్ మొబిలిటీ అథారిటీ ఏర్పాటు చేయాలని సిఫార్సుచేసింది. దీనిద్వారా భారత యవత విదేశాల్లో ఉపాధి అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి వీలవుతుందని పేర్కొంది. 

* ఉపాధి పెంచడంతో పాటు ఉత్పాదకతను మెరుగుపర్చడానికి తగిన చర్యల్ని సిఫార్సుచేసే ఒక నిపుణుల కమిటీ ఏర్పాటును కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించాలని కోరింది.