బెల్లంపల్లి (విజయ క్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్ లో గల ఒక ఇంట్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను శనివారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుండి రూ 19,500 నగదు తో పాటు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్ల వారిలో తడక రవి (అశోక్ నగర్), ఎండి యాకుబ్ (హనుమాన్ బస్తి), పిల్లి రాజు (బజార్ ఏరియా), పిట్టల సంపత్ (హనుమాన్ బస్తి), నార్ల శ్రీనివాస్ (హనుమాన్ బస్తి), వెంకటస్వామి (ర డగం బాల బస్తీ), మంద కృష్ణ (డబ్బు సేట్ లైన్) లు ఉన్నారు. వీరిని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.