calender_icon.png 30 October, 2024 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన్యప్రాణులను వేటాడుతున్న ఏడుగురి అరెస్ట్

30-10-2024 01:15:19 AM

  1. పరారీలో మరో వ్యక్తి
  2. వివరాలు వెల్లడించిన డీఎఫ్‌వో నీరజ్‌కుమార్

కుమ్రంభీ ఆసిఫాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): వన్యప్రాణుల ను వేటాడితే కఠిన చర్యలు తప్పవని అటవీశాఖ జిల్లా అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ హెచ్చరించారు. సిర్పూర్‌లోని డీఎఫ్‌వో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సిర్పూర్ రేంజ్ పరిధిలో వన్యప్రాణులను వేటాడతున్న ఎనిమిది మందిని గుర్తించామన్నారు. వీరిలో ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని, మరొకరు పరారీలో ఉన్నార న్నారు. ప్రధాన నిందితుడు దీపక్ ఠాకుర్ ఇంట్లో అడవి పంది మాం సాన్ని గుర్తించామన్నారు. మంగళవారం నిందితులను రిమాండ్‌కు పంపించామన్నారు.