22-02-2025 03:15:52 PM
ఎస్‌ఎల్‌బీసీ సొరంగనికి లైనింగ్ పనులు చేపడుతుండగా కూలిన పైకప్పు.
పనులు జరుగుతున్న స్థలంలో 50 మందికి పైగా కూలీలు.
ఘటన స్థలానికి చేరుకున్న మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణ రావు, కలెక్టర్ సంతోష్
నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు నుండి ఎస్‌ఎల్‌బీసీ సొరంగ(SLBC tunnel) మార్గం గుండా నల్గొండ ప్రాంతానికి సాగు తాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ప్రాజెక్టు పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. గత పదేళ్ల కాలంగా ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఆ పనులు వేగవంతం చేయాలన్న లక్ష్యంతో నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సొరంగం పనులు తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో లైనింగ్ పనులు జరుగుతుండగా దోమల పెంట పరిసర ప్రాంతంలో సుమారు మూడు మీటర్ల పరిధి వరకు ఒక్కసారిగా కుప్పకూలింది.
ఆ ప్రాంతంలో సుమారు 50 మందికి పైగా కూలీలు పనిచేస్తుండగా మట్టి దిబ్బలు కూలి నీటి ప్రవాహానికి బురదలో ఎనిమిది మంది కార్మికులు గాళ్లంతాయ్యారు. వారిలో పంజాబ్ కి చెందిన గుర్బీత్ సింగ్, సన్నీత్సింగ్, చాతీస్ ఘడ్ చెందిన శ్రీనివాసులు, మనోజ్ రూబెన, సందీప్, జార్ఖండ్ చెందిన సంతోష్, జట్కా హీరాన్ . వీరి ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదు. మరి కొందరు కార్మికులు ప్రాణభయంతో బయటికి పరుగులు పెట్టారు వారిలో కొందరికి వైద్యులు అక్కడే వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అప్రమత్తమై సంఘటన స్థలానికి వైద్య సిబ్బంది ద్వారా కార్మికులకు ప్రత్యేక చికిత్స అందించారు. సంఘటన స్థలికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు, డిఐజి సత్య నారాయణ, అక్కడి అధికారిలతో కలిసి కార్మికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వార్డ్ రఘునాథ్ పలువురు నాయకులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.