calender_icon.png 3 April, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉర్కొండపేట ఘటనలో ఏడుగురి అరెస్ట్

03-04-2025 01:29:44 AM

ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం: ఎస్పీ

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా ఉర్కొండపేట గుట్ట ప్రాంతంలో వివాహితపై జరిగిన సా మూహిక అత్యాచార ఘటనలో ఏడుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం తెలిపారు. గత నెల 29న ఉర్కొండలోని ఆంజనేయ స్వామి దేవాలయానికి తన దూ రపు బంధువుతో వెళ్లిన వివాహిత దర్శనం అనంతరం అక్కడే జాగరణ చేస్తూ నిద్రించారు.

అనంతరం ఆలయానికి 100 మీటర్ల దూరంలో ఉన్న గుట్ట ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లారు. గమనించిన నిందితులు వారి ని అటకాయించి వెంట వచ్చిన వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి వివాహితపై ఒకరి తర్వాత ఒక రు వరుసగా ఏడుగురు అత్యంత దారుణం గా అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహ త ప్పి పడిపోయి దాహం వేస్తుందని అడిగినా కనికరించకుండా నిందితుడు కార్తీక్ వివాహి త నోట్లో మూత్ర విసర్జన చేశాడు.

హరీష్‌గౌడ్ అనే నిందితుడు ఫొటోలు వీడియోలు తీశాడు. మొదట ఫిర్యాదు ఇచ్చేందుకు వెనకడుగు వేసిన బాధితురాలికి పోలీసులు బాసటగా నిలిచి ఫిర్యాదు స్వీకరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుల్లో మారపాకుల అంజనేయులు (25), సాదిక్ బాబా (28), వాగులదాస్ మణి (మణికంఠ) (21), కార్తిక్ (20), మత్త మహేష్‌గౌడ్ (28), హరీష్‌గౌడ్ (23), మత్త అంజనేయులుగౌడ్ (24) ఉన్నారు.

వీరిలో ఇద్దరికి వివాహం అయింది. వీ రు గతంలోనే అనేక నేరాలకు పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులకు త్వరగా కఠిన శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, ఆధారాలను సమర్పిస్తామన్నారు.