calender_icon.png 26 March, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తుల పట్టివేత

25-03-2025 11:03:46 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ సుభాష్ నగర్ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం పట్టణ సుభాష్ నగర్ శివారు మార్కెట్ యార్డు వెనకాల, పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు, ఖానాపూర్ పిఎస్ బ్లూ కోల్ట్స్ సిబ్బంది, డి నరసవ్వ, జి నర్మదా, రైడ్ చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారని, వారి వద్ద రూ. 3440 నగదు సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.