calender_icon.png 17 November, 2024 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడు కొత్త సాగు పథకాలు

03-09-2024 01:16:51 AM

  1. రూ.17 వేల కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం 
  2. గుజరాత్‌లో మరో సెమీకండక్టర్ యూనిట్‌కు పచ్చజెండా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు ప్రోత్సహించడంతో పాటు దేశవ్యాప్తంగా ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో వ్యవసాయానికి సంబంధించి 7 కీలక పథకాలను ఆమోదించింది. ఇందుకోసం మొత్తం రూ.13,966 కోట్లు కేటాయిస్తున్నట్లు భేటీ అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైతుల ఆదాయం పెంపుతో పాటు వారి జీవితాలను మెరుగుపరిచేందుకు ఈ పథకాలను తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. 

పథకాలు ఇవే.. 

  1. రూ.2,817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌ను ఏర్పాటు
  2. వ్యవసాయ విద్య, నిర్వహణ ప్రణాళికకు రూ.2,291 కోట్లు
  3. హార్టికల్చర్ ప్రణాళికకు రూ.860 కోట్లు
  4. పాడి పశువులు ఆరోగ్య సంరక్షణ, ఉత్పత్తి ప్రణాళికకు రూ.1,702 కోట్లు
  5. కృషి విజ్ఞాన కేంద్రాన్ని బలోపేతం చేసేందుకు రూ.1,202
  6. సహజ వనరుల నిర్వహణ కోసం రూ.1,115 కోట్లు 

ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు సైతం..

వ్యవసాయరంగంతో పాటు మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు సైతం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 

  1. ముంబై మధ్య 309 కి.మీ. రైల్వే ప్రాజెక్టుకు రూ.18,036 కోట్లు కేటాయించింది. 2028 వరకు దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. 
  2. కెయిన్స్ సెమికాన్ ప్రై.లి. కింద మరో సెమీకండక్టర్ కేంద్రానికి ఆమోదం లభించింది. గుజరాత్‌లోని సనంద్‌లో రూ.3,300 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు.