calender_icon.png 27 January, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు

07-12-2024 03:09:31 AM

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 28 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయగా అందులో తెలంగాణకు 7 కేటాయించింది. అందులో మహబూబ్‌నగర్, సంగారెడ్డి, జగిత్యాల, నిజామాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9 నవోదయ విద్యాలయాలుండగా వీటితో కలిపి 16కు చేరుకోనున్నాయి.

అయితే జేఎన్వీలను ప్రారంభించనప్పుడు కేంద్రం జిల్లాకు ఒక్కటి చొప్పున తీసుకురాగా.. జిల్లాల సంఖ్య పెరగడంతో ఆ స్థాయిలో కొత్త విద్యాలయాలను మంజూరు చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రానికి నవోదయ విద్యాలయాలను మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు. తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెలబెట్టుకున్నామని, వెనుకబడిన పాలమూరు జిల్లాకు నవోదయ ద్వారా మెరుగైన విద్య లభించనుందన్నారు. కాగా నవోదయ విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంలో 6 నుంచి 12వ తరగతి వరకు గురుకుల విధానంలో ఉచిత విద్యను అందిస్తారు.