calender_icon.png 7 January, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుగురు గంజాయి విక్రేతల అరెస్ట్

04-01-2025 12:24:52 AM

కోదాడ, జనవరి 3: గంజాయి అమ్ముతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు కోదాడ  డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మునగాల మండలం నారాయణపురానికి చెందిన కొచ్చెర్ల కేరి, గరిడేపల్లి మండలం కల్మలచెర్వుకు చెందిన కొచ్చెర్ల ప్రేమ్‌కుమార్, నేరేడుచర్ల మండలం సోమారానికి చెం  భీమిశెట్టి మహేష్‌లతో పా  మరికొందరు ఒడిశాకు చెందిన పంగి సీతారాం వద్ద గంజాయిని కొని సేవించడంతో పాటు అమ్ముతున్నారు.

మునగాల మండలం, నర్సింహాపురం గ్రామ శివారులోని మిడ్ ల్యాండ్ హోటల్ వెనుక వెంచర్‌లో పంగి సీతారాం తీసుకొచ్చిన గంజాయిని కొనేందుకు శుక్రవారం కొచ్చెర్ల కేరి, ప్రేమ్ కుమార్, భీమిశెట్టి మహేష్, పసుపులేటి శబరినాధ, తిరుగమళ్ళ యశ్వంత్, వీరబోయిన మధు, కొమ్మగాని సాయి సతీష్, చాపల రాకేష్ చేరుకున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు మున  పోలీసులు దాడులు నిర్వహించగా కొచ్చెర్ల కేరి పరార  మిగిలిన 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరి నుంచి రూ.20 వేల విలువగల గంజాయితో పాటు నాలుగు బైక్‌లు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.