calender_icon.png 1 March, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుగురు మావోయిస్టుల లొంగుబాటు

01-03-2025 01:05:13 AM

చర్ల, ఫిబ్రవరి 28 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గడ్ లోని సుక్మా జిల్లాలో ఏడుగురు  హార్డ్కోర్ మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు. వీరిపై మొత్తం రూ 32 లక్షల రివార్డు ప్రకటించబడింది.ఇద్దరు పురుషులు, ఒక మహిళా మావోయిస్టు పై రూ 8 లక్షల రివార్డు ఉంది.

వీరంతా ఎస్.పి కిరణ్ చవాన్ సమక్షంలో లొంగిపోయారు.2021 టేకులగూడ ఘటనలో పాల్గొన్నారు, ఈ ఘటనలో 22 మంది జవాన్లు వీరమరణం పొందారు.వీరికి ప్రోత్సాహక నగదు అందించబడింది, అలాగే ప్రభుత్వ పునరావాస విధానం ప్రయోజనం కల్పించబడుతుంది అధికారులు తెలియజేశారు.