calender_icon.png 24 December, 2024 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చార్జీల పెంపుతో 7.65లక్షల విద్యార్థులకు లబ్ధి

02-11-2024 03:09:56 AM

రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, నవంబరు 1 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీల పెంచడంతో రాష్ట్రంలోని 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ పట్టణంలోని శర్మనగర్ బీసీ గురుకుల పాఠశాలలో దీపావళి వేడుకల్లో పాల్గొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ గత ఏళ్లలో ఓపెన్ మార్కెట్‌లో పలు వస్తువుల ధరలు పెరిగినప్పటికీ విద్యార్థుల మెస్ చార్జీలు పెరగలేదన్నారు.

బీసీ సంక్షేమశాఖ మంత్రిగా, విద్యార్థి నాయకుడిగా పిల్లలకు మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాలనే విషయాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల తరఫున ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం 19 వేల ప్రమోషన్లు, 35 వేల టీచర్ బదిలీలను చేపట్టినట్లు చెప్పారు. జాతీయ, రాష్ట్ర స్థాయి ఆటల్లో రాణించేలా విద్యార్థులను స్పోర్ట్స్ టీచర్స్ తీర్చిదిద్దాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్‌లు, ఆట స్థలాలను త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. 

దీపావళి సందర్భంగా ప్రజాప్రతినిధులు గురుకుల హాస్టల్స్‌ను సందర్శించాలన్నారు. 40 నెలలుగా భవనాల అద్దె పెండింగ్‌లోనే ఉంటే తమ ప్రభుత్వం ఆ బిల్లులను క్లియర్ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, ఆర్‌సీవో అంజలి, ప్రిన్సిపాల్ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.