25-04-2025 01:35:56 AM
బజాజ్ పల్సర్ స్వాధీనం, ఇద్దరి అరెస్ట్.
భద్రాచలం, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి) : ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి భద్రాచలం మీదుగా బజాజ్ పల్సర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గురువారం జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం పోలీసులు పట్టుకున్నారు.ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ నుంచి భద్రాచలం మీదుగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు, కొత్తగూడెం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ భద్రాచలం లోని కూనవరం రోడ్డు లో తనిఖీలు చేపట్టారు.
అదే సమయంలో బజాజ్ పల్సర్ వాహనంపై ఇద్దరు అనుమానితులు కనిపించడంతో వారిని అదుపులో తీసుకొని తనిఖీ దీంతో గంజాయిఅక్రమ రవాణా గుర్తించి ఏడు కేజీల గంజాయి ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించారు. గంజాయి తో పాటు బజాజ్ పల్సర్ వాహనాన్ని, ఒక మొబైల్ ఫోన్ స్వాధీన పరచుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. స్వాధీన పరచుకున్న గంజా యి విలువ రూ. 3.5 లక్షలు గా ఉంటుందని వారు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్.ఐ గౌతమ్ సిబ్బంది హాబీబ్ పాషా, వెంకట నారాయణ, గురవయ్య, శ్రావణి, పార్థసారథి,పాల్గొన్నారు.