calender_icon.png 17 March, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడు వందల కోళ్లు మృతి..

05-03-2025 06:06:10 PM

బైంసా (విజయక్రాంతి): కోళ్ల ఫారం షెడ్డులో ఆకస్మికంగా 700 కోళ్లు మృత్యువాత పడ్డాయి. స్థానికుల కథనం వివరాలు ఇలా ఉన్నాయి. బైంసా మండలం తిమ్మాపూర్ గ్రామంలో పునీందర్ కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే బుధవారం ఉదయం ఆయన షెడ్డుకు వచ్చి చూడగా కొన్ని కోళ్లు మృతి చెందాయి. తదనంతరం ఒక్కొక్కటిగా సాయంత్రం వరకు 700 కోళ్లు మృతి చెందాయి. బాధితుడు పశువైద్యాధికారి డాక్టర్ విట్టల్ కు, పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించి కోళ్ల నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు. కోళ్లకు సరఫరా చేసిన నీటి  పరిశీలించగా విషం కలిపినట్టు వాసన వస్తుందని గ్రహించారు. ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.